ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి భరత్ అన్నారు. శుక్రవారం ఆయన అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించారు. తాడిపత్రిలో మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు వచ్చిన కొన్ని ప్రాజెక్టుల సమస్యలు తొలగిపోయి, నిర్మాణాలు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. తాడిపత్రిలో గ్రానైట్ పరిశ్రమలు పునఃప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం కనకదిన్నె వద్ద రూ.11 కోట్లతో నిర్మించనున్న టమాటా ప్రాసెసింగ్ యూనిట్‌కు ఎమ్మెల్యే శ్యాంబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లో పూర్తిచేస్తామన్నారు. టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చాక ఓర్వకల్లు అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. కంపెనీలు ఏర్పాటుచేసి గ్రామీణ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ రంజిత్‌బాషా పాల్గొన్నారు.
![]() |
![]() |