అమెరికా ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురై విమానం నుంచి దట్టమైన మంటలు, పొగ వచ్చాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొలరాడో స్ప్రింగ్స్ నుంచి డల్లాస్ ఫోర్‌కు వెళ్తే సమయంలో డెన్వర్ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. విమానం ల్యాండ్ అవగా ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ మొత్తం కప్పేసింది. ప్రమాద సమయంలో 172 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఎమర్జెన్సీ విండో నుంచి విమానం రెక్కలపైకి ప్రయాణికులు చేరుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దట్టంగా పొగ కమ్మేసిన ఆ విమానం నుంచి రెక్కల మీది నుంచి అందులోని ప్రయాణికులు బయటికి వస్తున్న వీడియో వైరల్ అయింది.
![]() |
![]() |