కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో తల్లిదండ్రుల పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు సీల్దా కోర్టు ఇటీవల జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఈ కేసులో మళ్లీ సీబీఐ విచారణ జరిపించాలని మృతురాలి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు తాజాగా ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. కోల్‌కతా హైకోర్టులో ఈ పిటిషన్‌ను కొనసాగించొచ్చని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa