వ్యూస్ కోసం బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ డబ్బులు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో హర్షసాయి, విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), కిరణ్ గౌడ్‌తో పాటు మొత్తం 11 మందిపై పంజాగుట్టు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు నమోదయ్యాయి. వారిపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఈ యాప్స్‌ను కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిపై ఐపీఎస్ అధికారి, టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి.. అమాయకులకు నష్టం చేకూరుస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని ఇటీవల ప్రకటించిన సజ్జనార్.. తాజాగా సిటీ పోలీసులు 11 మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు. ఇటీవల హర్షసాయి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను సజ్జనార్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత దీనిపై అందరు కలిసి పోరాడాలని పిలుపును ఇచ్చారు. దీనికి చాలా మంది మద్దతు కూడా పలికారు.
బెట్టింగ్ యాప్స్‌లో అప్పుల పాలైన వారు రోడ్ల మీదకు వస్తుండగా.. కొందరు అప్పులు తీర్చే మార్గాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ను, గేమింగ్ యాప్స్‌లను ప్రమోట్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు.
ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నవారు వీటిని ప్రమోట్ చేయడం వల్ల.. వారు చెప్పింది నమ్మి.. డబ్బులకు ఆశపడి.. ముఖ్యంగా యువత డబ్బులు పెడ్తున్నారు. మొదట్లో ఆ యాప్స్ నుంచి డబ్బులు బాగానే వస్తుండటంతో.. పెద్ద మొత్తంలో పెట్టి మోసపోతున్నారు. చివరకు అప్పుల పాలై నష్టపోతున్నారు. అందుకే దీనిపై ఆర్టీసీ ఎండీ పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చారు. తాజాగా 11 మంది యూట్యూబర్ల కేసులు నమోదు చేయడంతో.. వీటి బారిన పడిన వారు.. నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |