చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పవర్‌లూం యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాల వల్ల 93 వేల చేనేత కార్మికుల కుటుంబాలకు, 10,534 పవర్‌లూం యూనిట్లకు లబ్ధి చేకూరనుంది. ఎన్నికల సమయంలో ఈ రెండు హామీలూ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిని నెరవేర్చారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం అమరావతి సచివాలయంలో 4 గంటలపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిలో వివిధ పనులను ఆయా సంస్థలకు అప్పగించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం 2025ను ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది.
![]() |
![]() |