ప్రఖ్యాత శాస్ర్తీయ నృత్యరూపకం కూచిపూడి పుట్టినిల్లైన ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడి గ్రామాన్ని పూర్తిగా అభివృద్థి చేసి, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తీర్చిదిద్దాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం లోక్‌సభలో మాట్లాడిన ఆమె.. కూచిపూడి గ్రామంలో ప్రస్తుతం తగిన మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. ఇక్కడ అత్యాధునిక ప్రదర్శన కళా కేంద్రాలు, మ్యూజియం, రికార్డింగ్ స్టూడియోలు, సందర్శకులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు.
![]() |
![]() |