నేడు ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అసెంబ్లీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గ్రూప్ ఫోటో సందర్భంగా వీరిద్దరి మధ్య ఓ అంశం చర్చకు వచ్చింది. ఎలా ఉన్నారు అంటూ డిప్యూటీ సీఎంను బొత్స పలకరించారు. గ్రూప్ ఫోటో అనంతరం తిరిగి వెళుతూ మరోసారి కాసేపు డిప్యూటీ సీఎంతో బొత్స మాట్లడారు. ఢిల్లీ నుంచి వచ్చాక ఎప్పుడు సభకు వస్తారు అని పవన్‌ను బొత్స అడిగారు. ఎప్పుడు వస్తారో చెపితే కొల్లేరులో అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతులు డెలిగేషన్ వచ్చి కలుస్తుందని తెలిపారు. దీంతో ఎప్పుడు వచ్చేది చెబుతానని పవన్ కళ్యాణ్ అన్నారు.ఈ సందర్భంగా కొల్లేరు వాసుల అభ్యర్థనను డిప్యూటీ సీఎంకు దృష్టికి తీసుకొచ్చారు బొత్స. సుప్రీం కోర్టులో కేసు వేయడంతో ఈ నెల 9 నుంచి అటవీశాఖ సర్వే నిర్వమిస్తోందని.. మూడు నెలల్లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని గత ఏడాది డిసెంబర్‌లో సుప్రీం కోర్టు ఆదేశించిందని చెప్పారు. రేపు (బుధవారం) సుప్రీం కోర్టులో కొల్లేరు వ్యాజ్యంపై విచారణ జరుగనుందని.. దీంతో అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఈ కారణంగా వారి డేలిగేషన్ వచ్చి కలుస్తారు టైం ఇవ్వాలని బొత్స కోరారు. దీంతో ఢిల్లీ నుంచి రాగానే సమయం ఇస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు.కాగా.. ఫొటో సెషన్ ముగించుకుని పవన్ లోపలికి వెళ్తున్న సమయంలో బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్సీలు ఎదురొచ్చి మరీ డిప్యూటీ సీఎంను కలిశారు. ‘బాగున్నారా , ఆరోగ్యం ఎలా ఉంది’ అంటూ పవన్‌ను బొత్స పలకరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, బొత్స సత్యనారాయణ పరస్పరం కరచాలనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa