ముఖ్యమంత్రి ఢిల్లీ షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈరోజు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం. ఈరోజు రాత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంలో జరిగే విహాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. రేపు(మార్చి 19) మధ్యాహ్నం గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్‌తో ముఖ్యమంత్రి ఢిల్లీలో సమావేశంకానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకోనున్నాయి. 19న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి తిరిగి వస్తారు. 20న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. 20వ తేదీ రాత్రికి అమరావతి నుంచి తిరుమలకు వెళ్లనున్న సీఎం.. 21న తిరుమలలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకుని అనంతరం తిరుగుప్రయాణం అవుతారు.
![]() |
![]() |