అంతరిక్షంలోకి వెళ్లింది 8 రోజుల కోసం. అనుకోని పరిస్థితులతో 286 రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయినా సునీతా, విల్మోర్ ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ISSలో రోజూ తన డ్యూటీ చేస్తూనే ఉన్నారు. ఇవాళ క్యాప్సుల్ నుంచి స్ట్రెచ్చర్‌పై బయటకు వచ్చాక చేయి ఊపుతూ నవ్వారు. వారిద్దరినీ హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. వారికి వైద్యపరీక్షలు చేయనున్నారు. 45 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.
![]() |
![]() |