ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అలాగే ఈరోజు ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాలు ఉభయ సభల్లో కొనసాగుతాయి. శాసన సభలో ఆయకట్టు స్థిరీకరణ..తోటపల్లి ప్రాజెక్ట్ ఆధునికీకరణ...పోలీస్ కానిస్టేబుళ్ల భర్తీ, ఎస్‌ఐలకు డిఎస్పీలుగా ప్రమోషన్లు.. కేంద్ర ప్రాయోజిత పథకాలు తదితర వాటిపై ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. అనంతరం ఎస్సీ వర్గికరణపై ఏక సభ్య కమిషన్ నివేదికను మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఉభయ సభల ముందు ప్రవేశపెడతారు. దీనిపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. కాగా ఈరోజు ఎస్సీ వర్గీకరణపై శాసనసభ తీర్మానం చేయనుంది.
![]() |
![]() |