విశాఖ క్రికెట్ స్టేడియం వద్ద వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో కాసేపట్లో నిరసన కార్యక్రమం జరగనుంది. దివంగత మహానేత వైయస్ఆర్ పేరును క్రికెట్ స్టేడియానికి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్‌సీపీ నేతలు నిరసనలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కూటమి కక్ష సాధింపులో భాగంగా నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు భారీ సంఖ్యలో స్టేడియం వద్ద మోహరించారు. కూటమి సర్కార్ పాలనలో విశాఖ క్రికెట్ స్టేడియానికి వైయస్ఆర్ పేరును తొలగించడం పట్ల వైయస్ఆర్‌సీపీ నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తొలగించిన పేరు యథావిధిగా పెట్టాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ స్టేడియానికి వైయస్ఆర్ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్‌సీపీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో, చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు.నిరసనల నేపథ్యంలో గురువారం తెల్లవారుజామునుంచే వైయస్ఆర్‌సీపీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. ఈరోజు ఉదయమే పలువురు నేతల ఇళ్ల వద్దకు పోలీసులు చేరుకుని వారి హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా క్రికెట్ స్టేడియం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.
![]() |
![]() |