ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అపర కుబేరుడు బిల్ గేట్స్ స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం, అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని బిల్ గేట్స్ చెప్పారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఇండియా, ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగిందని.. వైద్యం, విద్య, వ్యవసాయ రంగాల్లో ఎంఓయూ చేసుకున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు తమ సహకారం ఎప్పుడూ కొనసాగిస్తామని గేట్స్ పేర్కొన్నారు. ఈ మేరకు ఒప్పందాల సమయంలో జరిగిన మీటింగ్‌పై చంద్రబాబు చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ బిల్ గేట్స్ రీట్వీట్ చేశారు.
![]() |
![]() |