ఆటో నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం ఉదయగిరి మండలంలో చోటుచేసుకుంది. తిరుమలాపురం ఎస్టి కాలనీకి చెందిన వేమూరి కొండయ్య పనులు ముగించుకుని ఉదయగిరి నుంచి ఆటోలో తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా సున్నం వారి చింతల సమీపంలో ఆటో నుంచి జారి కింద పడ్డాడు. చికిత్స నిమిత్తం అతనిని నెల్లూరుకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాదంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
![]() |
![]() |