పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరు అంకిత భావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. శుక్రవారం బాపట్ల జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీస్ సిబ్బంది నిర్వహించిన కవాతుకు ఎస్పీ పాల్గొని వీక్షించారు. ప్రిజనర్ ఎస్కార్ట్ విధులు కీలకమైనవన్నారు. ఎస్కార్ట్ విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. విధులలో నిర్లక్ష్యం వ్యవహరించినా, ప్రలోభాలకు లోనైన ఉపేక్షించబోమని హెచ్చరించారు.
![]() |
![]() |