ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు సంబంధించిన టెస్లా కార్లపై ఈ మధ్య విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. కావాలనే కొంత మంది ఆయన కార్లను ధ్వంసం చేయడం, తగులబెట్టడం వంటివి చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇకపై మస్క్‌కు సంబంధించిన టెస్లా కార్లపై దాడులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష వేస్తామని.. వారికి సాయం చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను డోజ్ అధినేతగా నియమించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి.. అనేక మందిని ఉద్యోగాల్లోంచి తీసేస్తూ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ఏమాత్రం మింగుడు పడని అమెరికా ప్రజలు.. మస్క్‌పై విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. వీలు దొరికినప్పుడల్లా ఆగ్రహం చేస్తూనే వస్తున్నారు. అయితే ఈమధ్య కొందరు ఆయన కార్లపై దాడులు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా టెస్లా కంపెనీకి సంబంధిచిన కార్లపై దాడులు ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యాయి.
5 టెస్లా కార్లకు నిప్పంటించిన దుండగులు..!
అమెరికా సహా ఇతర దేశాల్లోనూ టెస్లా షోరూమ్‌లు, విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లతో పాటు కార్లపై కూడా దాడులు చేస్తున్నారు. ఇటీవలే లాస్‌వెగాస్‌లో టెస్లా షోరూంలోని 5 కార్లకు దుండగులు నిప్పు అంటించారు. ఆపై ఓ కారుపై అసభ్య పదజాలంతో స్ప్రే పెయింట్ చేశారు. గత నెలలో టెస్లా ఉత్పత్తి చేసిన వాహనాలపై ఓ మహిళ పేలుడు పదార్థాన్ని విసరగా.. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే చార్లెస్టన్ సమీపంలో టెస్లా ఛార్జింగ్ స్టేషన్లను తగులబెట్టిన ఒక వ్యక్తిని సౌత్ కరోలినాలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
దాడులు చేస్తే 20 ఏళ్ల జైలుశిక్ష..!
ఇదంతా ఇలా ఉండగా.. భద్రత కరవైందన్న కారణంగా కెనడాలో అంతర్జాతీయ వాహన ప్రదర్శన నుంచి టెస్లా తన ఉత్పాదనలను వెనక్కి తీసుకుంది. అయితే తాజాగా దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. భవిష్యత్తులో టెస్లా కార్లపై దాడులకు పాల్పడిన వారికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఈ దాడులను ప్రోత్సహిస్తున్న వారికి కూడా శిక్షలు తప్పవని వివరించారు.
![]() |
![]() |