ఏపీలోని 18 మండలాల్లో శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా-6, విజయనగరం-7, పార్వతీపురం మన్యం-5 మండలాల్లో (మొత్తం 18 మండలాలు) వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు..ఆదివారం మన్యం జిల్లా -4 అల్లూరి జిల్లా-2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమర్రి లో 40.9°C, కర్నూలు జిల్లా కోసిగిలో 40.6°C, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.2°C, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట, అన్నమయ్య జిల్లా గాదెలలో 40.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 28 మండలాల్లో ఓ మోస్తరు వడగాల్పులు వీచాయి..రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పిడుగులతోపాటు గంటకు 30 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని.. కొద్దిరో జులుగా వడగాలులు, తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభిస్తుందని పేర్కొంది.
![]() |
![]() |