2025 IPL నిన్న రెండో మ్యాచ్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో 'విగ్నేష్ పుత్తూరు' అద్భుతంగా బౌలింగ్ వేసాడు. డెబ్యూ మ్యాచ్ లోనే ఆకట్టుకున్నాడు కేరళకు చెందిన విఘ్నేశ్ పుతుర్. చెపాక్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై నాలుగు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఓ దశలో సునాయసంగా గెలుస్తుందనకున్న చెన్నైని తన స్పిన్ మ్యాజిక్ తో కట్టి పడేశాడు పుతుర్. తన స్పిన్ మ్యాజిక్ తో మూడు కీలకమైన వికెట్లు తీయడంతో ఒక దశలో చెన్నై ఓటమి దిశగా సాగింది. ముఖ్యంగా అప్పటికే భీకరంగా ఆడుతున్న చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ని తన తొలి ఓవర్ లోనే పుతుర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత శివమ్ దూబే, దీపక్ హుడాలను పెవిలియన్ కు పంపి, మ్యాచ్ లో ముంబై తిరిగి పుంజుకునేలా చేశాడు. అయితే చివర్లో రవీంద్ర జడేజా సహకారంతో ఓపెనర్ రచిన్ రవీంద్ర కంఫర్టబుల్ గా జట్టును విజయ పథంలోకి నడిపించాడు. గతేడాది మెగావేలంలో కేవలం రూ.30 లక్షలకు ముంబై, పుతుర్ ను కొనుగోలు చేసింది. అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ యంగ్ ప్లేయర్ ని ధోని ప్రశంసించిన వీడియో వైరల్ అవుతున్నాయి.
— Johns. (@CricCrazyJohns) March 23, 2025
#CSKvMI pic.twitter.com/caz8hKBOP4
— Richard Kettleborough (@RichKettle07) March 23, 2025
![]() |
![]() |