పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని, తప్పనిసరిగా తాగునీరు అందుబాటులో ఉంచాలని చంద్రబాబు సూచించారు. అడవుల్లో అగ్నిప్రమాదాలు, కార్చిచ్చులపై అప్రమత్తంగా ఉండాలని, డ్రోన్లతో పర్యవేక్షించాలని సూచించారు. ఎవరైనా బాధ్యతా రాహిత్యంగా కార్చిచ్చుకు కారణం అయినట్లు తెలిస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అగ్నిప్రమాదాలు జరిగే అస్కారం ఉండేపరిశ్రమల్లో మరితం అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన రూ.39 కోట్లు విడుదలకు కూడా సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నీటి లభ్యత పెంచేందుకు గ్రామాల్లో నరేగా ద్వారా ఫాం పాండ్స్ నిర్మాణం, చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు.అదే విధంగా వేసవిలో నరేగా కూలీలకు అదనపు పనిదినాలు మంజూరు చేయడంతో పాటు... వారికి పని ప్రాంతంలో నీళ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపు ఉపాధి హామీ కూలీలు పనులు ముగించుకుని ఇంటికి చేరుకునేలా చూడాలన్నారు. ప్రజలు, ఉపాధి కూలీలు, ప్రయాణికులు వడదెబ్బ బారిన పడకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అటు, మున్సిపల్ కార్మికులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు బయట ప్రాంతాల్లో పని అప్పగించకుండా చూడాలని సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో బెడ్లు, వైద్యులు, వడదెబ్బకు ట్రీట్మెంట్ అందించే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటి నుంచే దోమల నివారణ చర్యలు చేపట్టాలని... తద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలు వ్యాధుల బారినపడకుండా చూడాలన్నారు.
![]() |
![]() |