అధికార తెలుగు దేశం పార్టీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం పి లింగాపురం గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ సర్పంచ్ కేశవ రెడ్డి గారి నాగార్జున రెడ్డి, ఆయన తండ్రి, అనుచరులపై టీడీపీ మూకలు కర్రలతో దాడికి దిగాయి. ఈ దాడిలో నాగార్జునరెడ్డితో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. టీడీపీ నేతల దాడిని వైయస్ఆర్‌సీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
![]() |
![]() |