హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం తన అసమర్థత నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు లేని లిక్కర్‌స్కామ్‌ను తెరమీదికి తీసుకువచ్చిందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు డైరెక్షన్‌లో తాజాగా లోక్‌సభలో ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు పచ్చి అబద్దాలను అందంగా వల్లించాడని మండిపడ్డారు. నిన్నటి వరకు వైయస్‌ఆర్‌సీపీలో ఎంపీగా ఉన్న ఆయనకు రాష్ట్రంలో లిక్కర్ పాలసీలో ఒకవేళ అవినీతి జరుగుతుంటే ఆ విషయం తెలియలేదా? ఈ రోజు టీడీపీలో చేరి పార్లమెంటరీ నేతగా మారిన తరువాతే లిక్కర్‌స్కాం గురించి తెలిసిందా అని ప్రశ్నించారు. అయన మాట్లాడుతూ.... టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయులు లోక్‌సభలో మాట్లాడుతూ ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ, దానిలో పలువురి పేర్లను ఉటంకిస్తూ అర్థంలేని ఊహాజనితమైన ప్రసంగం చేశారు. లేని ఈ స్కామ్‌లో వేలకోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్ళిపోయారంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. చంద్రబాబు గూటిలో చేరిన ఫ్లెమింగో పక్షిలాంటి శ్రీకృష్ణదేవరాయులు చంద్రబాబు డైరెక్షన్‌లోనే లోక్‌సభలో మాట్లాడారు. చంద్రబాబు మెప్పుకోసం ఈ రకంగా విషం చిమ్మే కార్యక్రమం చేపట్టారు. వైయస్ జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కొలేక ఇలాంటి నిరాధార నిందలు మోపుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలో భాగంగానే లోక్‌సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు అని అన్నారు.
![]() |
![]() |