అసలు జరగని లిక్కర్ స్కాంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, లోక్‌సభలో టీడీపీ ఎంపీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, కేవలం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే వైయస్ఆర్‌సీపీపై ఆరోపణలు చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి స్పష్టం చేశారు. అసలు వైయస్ఆర్‌సీపీ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదన్న ఆయన, తమ ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు పెంచారని, షాపుల సంఖ్య, మద్యం అమ్మకం వేళలు తగ్గించారని ఆయన వెల్లడించారు. నిజానికి రాష్ట్రంలో కొత్తగా 200 బ్రాండ్లను తీసుకొచ్చింది చంద్రబాబుగారి హయాంలోనే అని గుర్తు చేసిన ఆయన, వాస్తవాలను దాచి వైయస్ఆర్‌సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. చంద్రబాబు స్కిల్ స్కాంపై పార్లమెంట్‌లో మాట్లాడే దమ్ముందా? అని సవాల్ చేశారు. టీడీపీ ఎంపీలకు ధైర్యం ఉంటే చంద్రబాబు అందుకున్న ఈడీ, ఐటీ నోటీసులు చర్చిద్దామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎంపీ ఎం.గురుమూర్తి సవాల్ చేశారు.
![]() |
![]() |