ఐపీఎల్ 2025లో బౌండరీల వర్షం కురుస్తోంది. ఈ టోర్నీలో బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. హేమాహేమీ బౌలర్లు సైతం.. వారిని నిలువరించలేకపోతున్నారు. పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం.. ఇంపాక్ట్ ప్లేయర్ వంటి నిబంధనలు బౌలర్ల పాలిట శాపంగా మారాయి. దీంతో భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ 2025ని ఉద్దేశించి గుజరాత్ టైటాన్స్ పేసర్, దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ కగిసో రబాడ కీలక వ్యాఖ్యలు చేశాడు. టోర్నీ జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ టోర్నీలో బ్యాటర్లే పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుండటంపై తనదైన శైలిలో మండిపడ్డాడు. అసలు దీన్ని క్రికెట్ అంటారా? అని ప్రశ్నించాడు. ఇది ఏ మాత్రం క్రికెట్ కాదని, ఈ ఆటను బ్యాటింగ్ అని పిలవాలని తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రబడా.. పంజాబ్ కింగ్స్‌తోజరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీశాడు.
చాలా మంది ఫ్యాన్స్, మాజీలు.. రబాడ కామెంట్లకు మద్దతు తెలుపుతున్నారు. క్రికెట్‌లో బ్యాట్‌కు బంతికి మధ్య సమతూకం ఉంటేనే అసలు మజా వస్తుందని పేర్కొంటున్నారు. లేకుంటే మ్యాచ్ వన్‌సైడ్‌గా ముగుస్తోందని.. అప్పుడు ఇంట్రస్ట్ పోతోందని కామెంట్లు చేస్తున్నారు. జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్ నాలుగు ఓవర్లలో 76 పరుగులు సమర్పించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడే బౌలర్ల బాధలు తెలుస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక కగిసో రబాడ చేసిన కామెంట్లు కూడా నిజమే. ఎందుకంటే ఐపీఎల్ 2025లో జరిగిన తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగింట్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌లపై ఈజీగా 250 ప్లస్ రన్స్ నమోదవుతున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్‌గా మరో బ్యాటర్ క్రీజులోకి వస్తుండటం కూడా.. భారీగా స్కోరు నమోదు కావడానికి కారణంగా ఉంది. అయితే భారీ స్కోర్లతో ఈ సారి ఐపీఎల్ బౌలర్లకు పీడకలలు మిగుల్చుతున్నా, అభిమానులకు మాత్రం మజాను అందిస్తోంది.
![]() |
![]() |