రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి రైతాల్ గ్రామంలో 10వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికను ఇంటి బయట నుంచి అపహరించి, అటవీ ప్రాంతానికి ఎత్తుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటన గత వారంలో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసిన తరువాత బాలికను తెల్లవారుజామున గ్రామంలో వదిలేసి పారిపోయారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa