~Amazon.in పై అత్యంత వేగంగా పెరుగుతున్న శ్రేణులలో ఒకటి, 2024 వెర్సెస్ 2023 సంవత్సరాల రెండవ మధ్య కాలంలో 50% పెరిగింది
~అమెజాన్ ఫ్రెష్ విక్రేతలు 11,000 కంటే ఎక్కువ మంది రైతుల నుండి పండ్లు మరియు కూరగాయలను సేకరిస్తారు
~కొత్త పట్టణాలు/నగరాల్లో ఉన్న కస్టమర్లు ఇప్పుడు ఉన్నతమైన నాణ్యత గల పండ్లు & కూరగాయలు, గొప్ప ఆదాలు, మరియు సౌకర్యవంతమైన స్లాటెడ్ డెలివరీలను ఆనందించవచ్చు.
అమేజాన్ ఇండియా అమేజాన్ ఫ్రెష్ యొక్క గణనీయమైన విస్తరణను ప్రకటించింది, దీని పూర్తి-బాస్కెట్ కిరాణా సరుకుల సేవలు ఇప్పుడు దేశవ్యాప్తంగా 170 నగరాలు/పట్టణాలలో విస్తరించాయి. ఈ విస్తరణ H2’24 వెర్సెస్ H2’23లో అమేజాన్ ఫ్రెష్ యొక్క ప్రభావితపరిచే 50% ఇయర్-ఓవర్-ఇయర్ వృద్ధి సమయంలోనే కలిగింది. amazon.in పై అత్యంత వృద్ధి చెందే శ్రేణులలో ఒకటిగా తన స్థానాన్ని బలపరిచింది. అమేజాన్ ఫ్రెష్ పండ్లు, కూరగాయలు, పాలు,బ్రెడ్, ఫ్రోజెన్ ఉత్పత్తులు, సౌందర్య వస్తువులు, బేబీ కేర్ అవసరాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు మరియు పెట్ సరఫరాలు సహా వెట్ మరియు డ్రై కిరాణా సరుకుల విస్తృత శ్రేణిని అందిస్తోంది. ఈ సేవలు గొప్ప ఆదాలు, విస్తృత శ్రేణి ఎంపిక, నిర్దిష్టమైన సమయాలలో ఇంటి వద్ద డెలివరీలు చేసే సౌకర్యంతో నిరంతరంగా షాపింగ్ అనుభవాన్ని కేటాయించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి.తాజాదనం మరియు నాణ్యతను నిర్థారించడానికి, అమేజాన్ ఫ్రెష్ విక్రేతలు పండ్లు మరియు కూరగాయలను 11,000 రైతుల నుండి సేకరిస్తారు. అన్ని ఉత్పత్తులు కస్టమర్ వద్దకు చేరడానికి ముందు తీవ్రమైన ‘4-స్టెప్ నాణ్యతా తనిఖీ’ ప్రక్రియకు గురవుతాయి. నాణ్యత కోసం ఈ నిబద్ధత అనేది అమేజాన్ ఫ్రెష్ కోసం పెరిగిన కస్టమర్ల ప్రాధాన్యతకు తోడ్పడింది, దాని ఆదాలు, విస్తృతమైన ఎంపిక మరియు నమ్మకమైన డెలివరీలతో ప్రోత్సహించబడింది.
శ్రీకాంత్ శ్రీ రామ్, అమేజాన్ ఫ్రెష్ ఇండియా డైరెక్టర్, ఇలా అన్నారు, “170+ పట్టణాలు/నగరాలకు మా విస్తరణ అనేది భారతదేశపు టియర్- 2, టియర్-3 పట్టణాలు/నగరాలు మరియు అంతకు మించి చేరుకోవడాన్ని విస్తరించడానికి అనుమతినిచ్చింది, పోటీయుత ధరలకు కస్టమర్లు ఉన్నతమైన నాణ్యత గల కిరాణా సరుకులు పొందేలా , వారి ఇంటి వద్ద సౌకర్యవంతంగా అందచేయడానికి అవకాశం కల్పించింది. 24’ వెర్సెస్ 23’ రెండవ సగంలో 50% వృద్ధితో, వినియోగదారులు ఆదాలు, విస్తృతమైన ఎంపిక, నమ్మకమైన నిర్దిష్టమైన సమయాల డెలివరీల కోసం అమేజాన్ ఫ్రెష్ ను ప్రశంసించడం మేము గమనించాము. భారతదేశంలో ఆన్ లైన్ కిరాణా షాపింగ్ ను మార్చడం మరియు ప్రతి కొనుగోలును మా కస్టమర్లకు నిరంతరంగా మరియు బహుమానపూర్వకమైన అనుభవంగా మార్చడమే మా లక్ష్యం.” గోరఖ్ పూర్, చిత్తూరు, అంబాల, విజయవాడ మరియు ఇంకా ఎన్నో పట్టణాలకు అమేజాన్ ఫ్రెష్ యొక్క విస్తరణ అంటే మరింతమంది కస్టమర్లు ఇప్పుడు అమేజాన్ ఫ్రెష్ విక్రేతలు మరియు బ్యాంక్ భాగస్వాముల నుండి గొప్ప ఆదాలు మరియు ఉత్తేజభరితమైన డీల్స్ ను ఆనందిస్తూనే తమ వారపు మరియు నెలవారీ కిరాణా బాస్కెట్లను రూపొందించుకోవడం అని అర్థం. ఈ విస్తరణ అనేది భారతదేశంవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల కోసం ఆన్ లైన్ కిరాణా షాపింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చడానికి సిద్ధంగా ఉంది.
![]() |
![]() |