ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరేంద్రమోదీ ఆ సంస్థలను నాయశం చేశారు : కేజ్రివాల్

national |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2019, 04:30 PM

దేశానికి ఏమైనా ఇవ్వాలని భారతీయ జనతాపార్టీ ఎప్పుడూ ఆలోచించదని, దనికి ఓట్లు మాత్రమే కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ ధ్వజమెత్తారు. ట్విట్టర్ ద్వారా ఆయన పై విధంగా రాసుకొచ్చారు.‘‘భారతీయ జనతాపార్టీ దేశ వికాసం కోసం ఎప్పుడూ ఆలోచించదు. ఈ దేశంలో విద్య గురించి, పేదరికం గురించి, ఉద్యోగ కల్పన గురించి ఎప్పుడూ మాట్లాడదు. కానీ, బీజేపీ ఓట్ల గురించి మాట్లాడుతుంది. బీజేపీకి ఓట్లు మాత్రమే కావాలి. ఇలాంటి వాళ్లు అప్పుడు అప్పుడు నీతులు కూడా చెబుతారు’’ అంటూ ట్విట్ట‌ర్‌లో కేజ్రివాల్ మండిపడ్డారు. 


 ‘‘ఇప్పటి వరకు ప్రజలు ప్రధానిని ఎన్నుకోవడానికి ఓటేశారు. ఢిల్లీ ఓటర్లు ఈసారి రాష్ట్రవాదంపై ఓటేయడానికి సిద్దమయ్యారు’’ అని కేజ్రివాల్ మరో ట్వీట్ చేశారు. కాగా నెహ్రూపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను కేజ్రివాల్ ఖండించారు. నెహ్రూ ఎన్నో సంస్థలను నెలకొల్పి విద్యావంత, విజ్ఞానవంత దేశాన్ని తీర్చిదిద్దారని, నరేంద్రమోదీ ఆ సంస్థలను నాయశం చేశారని విమర్శించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa