వక్ఫ్ సవరణ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్ ఆడుతుందని వైయస్ఆర్‌సీపీ పీఏసీ మెంబర్ షేక్ ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముస్లిం హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ముస్లింల సంక్షేమాన్ని, అభివృద్దిని నిర్లక్ష్యం చేస్తూ.. పైకి మాత్రం ముస్లింలను రక్షించేవాడిలా నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో షేక్ ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ..... ముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో చంద్రబాబు రాష్ట్రంలో ఒకలా, ఢిల్లీలో మరో రకంగా మాట్లాడుతున్నాడు. ఈ బిల్లు విషయంలో చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారు. టీడీపీ మద్ధతు మీదనే కేంద్రం ఆధారపడి ఉంది. ఆ బిల్లును ఆదిలోనే టీడీపీ వ్యతిరేకించి ఉంటే ఇప్పుడు జేపీసీ వరకు వచ్చి ఉండేది కాదు. ఒకపక్క బిల్లుకి మద్దతు ప్రకటిస్తూనే నిన్న ఇఫ్తార్ విందులో వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారు. వక్ఫ్ సవరణ బిల్లు గనుకు పార్లమెంట్‌లో పాసైతే ముస్లిం సమాజం తీవ్రంగా నష్టపోతుంది అని ఆవేదన చెందారు.
![]() |
![]() |