మంగళగిరి టీడీపీ ఆఫీసులో తిరువూరు అంశం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వెంట తిరువూరు మాజీ ఇన్‌చార్జ్ శావల దేవదత్ ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... తిరువూరు పంచాయతీని పార్టీ అధిష్టానం చూసుకుంటోందని అన్నారు. ప్రతీ కుటుంబంలోనూ చిన్నపాటి వివాదాలు సహజమన్నారు. తిరువూరు సమస్యను పార్టీ కుటుంబ సమస్యగా అధిష్టానం కూర్చోపెట్టి పరిష్కరిస్తుందని తెలిపారు. తిరువూరు వరుస వివాదాలపై పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నియోజకవర్గంలో అందరి అభిప్రాయాలు ఇప్పటికే సేకరించి నివేదిక రూపొందించినట్లు చెప్పారు. నివేదిక ఆధారంగా అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.
![]() |
![]() |