వైసీపీ నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. క్వార్ట్జ్ కుంభకోణం, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, రవాణా కేసులో నిందితుల కదలికలపై పోలీసులు డేగకన్ను వేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సహా అయిదుగురు నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే కాకాణి ఇంటి ప్రధాన గేట్లకు విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు అంటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా రిమాండ్‌లో ఉన్న నిందితుల కస్టడీ కోసం పోలీసులు కోర్టులో పిటీషన్ వేశారు. విచారణను న్యాయస్థానం మంగళవారం నాటికి వాయిదా వేసింది. కాగా ముందస్తు బెయిల్ కోసం కాకణి గోవర్దన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణ కూడా మంగళవారం నాటికి వాయిదా వేసింది.
![]() |
![]() |