హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేకానికి సంబంధించిన వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం బింబవాస్తు, నవకలశ స్నపనం, చతుర్దశ కలశ స్నపనం, హోమం, పూర్ణాహుతి చేపట్టారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో శ్రీవారి మూలమూర్తికి విశేషంగా అభిషేకం చేశారు. ఈ అభిషేక దర్శనం భక్తులకు కనువిందు చేసింది. ఆ తరువాత మహాశాంతి పూర్ణాహుతి, రక్షాబంధనం, కుంభారాధనం, నివేదనం, శయనాధివాసం, హౌత్రం, సర్వదేవతార్చన, హోమం కార్యక్రమాలు నిర్వహించారు.
![]() |
![]() |