AP: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ విషయంలో ఆయన సోమవారం పోలీసు విచారణకు హాజరు కాలేదన్న సంగతి తెలిసిందే. కాకాణి కోసం హైదరాబాద్‌లో నెల్లూరు పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కాకాణి ఉండే 3 ఇళ్లకు నెల్లూరు పోలీసులు వెళ్లారు. పోలీసులు వచ్చేసరికి కాకాణి పరారయ్యారని సమాచారం. కాకాణి లేకపోవడంతో ఆయన బంధువులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa