కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా మరోసారి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు... చివరికి ఆ దేవదేవుడికి కూడా నిద్ర లేకుండా పోతోందని పేర్కొన్నారు.జగనన్న పాలనలో తిరుమలలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉండేదని, కానీ ఇప్పుడు స్వామికి నిద్ర లేకుండా చేస్తూ, భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారని విమర్శించారు. దర్శనాల సంఖ్యను 60 వేల వరకు పరిమితం చేస్తూ రోజుకు 7 వేల నుంచి 10 వేల బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ టీటీడీని తప్పుబట్టారు. దీంతో సామాన్య భక్తులకు స్వామి దర్శనం మరింత దూరమవుతోందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. సిఫారసు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్న వారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారని.ఇదేనా కూటమి, పవన్ కల్యాణ్, బీజేపీ సనాతన ధర్మం ఇదేనా చంద్రబాబు గారి నమూనా ప్రక్షాళన అంటూ మండిపడ్డారు. భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడు అంటూ రోజా ట్వీట్ చేశారు. 'ఏడుకొండల స్వామికి కునుకు కరవు' అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా రోజా పంచుకున్నారు.
![]() |
![]() |