చెన్నై : తమిళనాడులోని కోయంబత్తూరులో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. మసకలిపలాయంకు చెందిన ఆరుగురు పళనికి వెళ్లి తిరిగి వస్తుండగా వారి కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. మృతుల్లో ఇద్దరు బాలికలున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కెనాల్‌లో నుంచి కారును బయటకు తీశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa