రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఐదు రోజుల మగ శిశువును గుర్తు తెలియని మహిళ అపహరించింది. వైరవరం మండలం పాముగొంది గ్రామానికి చెందిన సాధల కళావతి, వీరపురెడ్డి దంపతుల బిడ్డను మంగళవారం మధ్యాహ్నం భోజన సమయంలో "బాగోలేదు, బాక్స్‌లో పెడతాను" అంటూ మాయమాటలతో తీసుకెళ్లింది. గుట్టేడు పిహెచ్‌సి నుంచి మెరుగైన చికిత్స కోసం తరలించగా ఈ ఘటన జరిగింది. డిఎస్పి సాయి ప్రశాంత్ కేసు నమోదు చేసి, ఐదు గంటల్లో భద్రాచలం ఘాట్ రోడ్ వద్ద శిశువును గుర్తించి, మహిళను అరెస్టు చేశారు.
![]() |
![]() |