తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి ఆకాష్ అంబానీ బుధవారం విచ్చేశారు. వీఐపీ దర్శన సమయంలో స్వామి సేవలో పాల్గొన్న ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనంతో తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఎస్‌వీ గోశాలకు వెళ్లి గోపూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, అంబానీ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
![]() |
![]() |