యూపీలోని హమీర్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్య.. భర్తను గొంతు కోసి హత్య చేసింది. భర్త అరవింద్ రోజూ మద్యం తాగి వచ్చి భార్య అనితను వేధించేవాడు.
ఈ క్రమంలో సోమవారం కూడా ఇద్దరు గొడవ పడగా సహనం కోల్పోయిన అనిత కత్తి తీసుకొని భర్త గొంతు కోసి హత్య చేసింది. దుండగులు హత్య చేసినట్లు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. చివరికి విషయం తెలియడంతో పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.
![]() |
![]() |