గుత్తి రైల్వే డీజిల్ షెడ్లో బుధవారం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ కు చెందిన చీఫ్ మెకానికల్ ఇంజినీర్ మధుసూదనరావు సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన డీజిల్ షెడ్లోని అన్ని విభాగాలను పరిశీలించారు.
రైలింజన్ల మరమ్మతులను పరిశీలించారు. రైల్వే కార్మికులతో మాట్లాడారు. రైల్వే ఇన్స్టిట్యూట్ను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వే కార్మిక సంఘాల నాయకులు సమస్యలపై వినతి పత్రం అందజేశారు.
![]() |
![]() |