కూటమి పాలనలో ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కుతున్నారు. టీడీపీ చేస్తున్న అరాచకాలు, అఘాయిత్యాలు రోజు రోజుకు తారాస్థాయికి చేరాయి. రెడ్ రాజ్యాంగం అంటూ వైయస్ఆర్సీపీ శ్రేణులపై దాడికి దిగుతున్నారు అని వైసీపీ నాయకులూ ఆరోపిస్తున్నారు. నిన్నటికి నిన్న అనంతపురం జిల్లా రాప్తాడు నియోజవర్గానికి చెందిన కురబ లింగమయ్యను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. వారి దాడులను వ్యతిరేకించినందుకు వైయస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలపై టీడీపీ దాడులకు దిగుతోంది. తాజాగా వైయస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్చార్జ్ మిట్ట మాధవ్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. అర్ధరాత్రి సమయంలో టీడీపీ నేతలు ముక్కుమ్మడిగా మాధవ్రెడ్డిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బంధువులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
![]() |
![]() |