మయన్మార్‌లో గత వారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 3,085కి చేరినట్లు సైనిక ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం మయన్మార్‌లోని రెండవ అతిపెద్ద నగరం మాండలే సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఈ భూకంపం కారణంగా వేలాది భవనాలు కుప్పకూలాయి.. రోడ్లపై పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో వంతెనలు కూడా ధ్వంసమయ్యాయి. దీని వల్ల 4,715 మంది తీవ్రంగా గాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa