మంగళగిరి ప్రజల కోసం దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘‘మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. మీకోసం అహర్నిశలు కృషి చేస్తున్నా. సూపర్ సిక్స్ హామీలతో పాటు మంగళగిరికి నేను ప్రత్యేకంగా ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చే పనిలో ఉన్నాను. ఏప్రిల్ 13న వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తాం. సరిగ్గా ఏడాదికి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తాం. ‘ఎన్టీఆర్ సంజీవని’ పేరుతో మంగళగిరి, తాడేపల్లిలో క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. దుగ్గిరాలలోనూ మొబైల్ క్లినిక్ పెట్టి ఉచిత చికిత్సలతో పాటు మందులు అందిస్తున్నాం. నీటి సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నాం. నిరుపేదలకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టుమిషన్లు అందజేశాం’’ అని మంత్రి లోకేశ్ వివరించారు.
![]() |
![]() |