కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు లేదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. హత్యా రాజకీయాలతో వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్న పరిటాల కుటుంబ నేర చరిత్ర నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు సునీత అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపిరెడ్డిపల్లిలో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త లింగమయ్య హత్యతో పరిటాల సునీత ప్రజల ముందు దోషిగా నిలబడ్డారని ధ్వజమెత్తారు. తమ నేరమయ రాజకీయాల నుంచి ముసుగు కోసం పరిటాల రవి హత్యను తెరమీదికి తేవడం ఆమెకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు.
![]() |
![]() |