మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా తమ ముందు హాజరుకావాలని కసిరెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చారు. కాగా, సీఐడీ నోటీసులను కొట్టివేయాలని కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ ఇచ్చిన నోటీసులపై జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. సీఐడీ నోటీసుకు చట్టబద్ధత ఉందని హైకోర్టు స్పష్టం చేశారు.
![]() |
![]() |