బాపట్ల జిల్లా బీసీ సమన్వయ కమిటీ కార్యాలయంలో బీసీ సమరభేరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ ఉప్పాల మురళి గౌడ్ మాట్లాడుతూ 11వ తారీకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు కొత్త బస్టాండ్ సెంటర్ పూలే విగ్రహం వద్ద జరిగేలా పెద్ద ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులను ఈ కార్యక్రమానికి పాల్గొనాలని పిలుపునిచ్చారు.
![]() |
![]() |