ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ పనితీరును బాగా మెరుగుపర్చుకుని 7వ స్థానానికి చేరుకుంది. జాతీయ ఎయుడ్స్ నియంత్రణ సంస్థ(న్యాకో) గురువారం రాష్ట్రాల పనితీరు సూచీని విడుదల చేసింది. 2024 ఏప్రిల్- డిసెంబరు మధ్య ఏపీసాక్స్ మెరుగైన పనితీరును కనబరిచి ఈ సూచీలో 7వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది వరకూ ఏపీ 17వ స్థానంలో ఉండేది. ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించడంలో ఏపీకృషిని న్యాకో అభినందించింది. 2004 నుంచి ఏపీలో దాదాపు 2,25,000మంది బాధితుల్ని గుర్తించడంతో పాటు వ్యాధి నియంత్రణకు రూ.127 కోట్లు న్యాకో ఖర్చుచేసింది. న్యాకో లక్ష్యాలకు అనుగుణంగా ఎయిడ్స్‌ను నియంత్రించడంలో ఏపీ మంచి పనితీరు కనబరిచినందుకు ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరిని, ఏపీశాక్స్ సిబ్బందిని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అభినందించారు.
![]() |
![]() |