బాపట్ల జిల్లా, కొల్లూరు మండలంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ కొట్టడంతో విద్యుత్ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. ఈపూరులో గురువారం అర్ధరాత్రి ఈదురు గాలులు, వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. వాటిని సరి చేసేందుకు దోనేపూడి పిఎల్‌డి శంకర్, అనంతవరం జెఏల్‌మ్ మహేష్ వెళ్లారు. 33 కేవీ లైన్ ఎల్‌సి తీసుకుని పనిచేస్తుండగా ఇండక్షన్ వచ్చి ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాలను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![]() |
![]() |