రాజమండ్రిలోని కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పార్మసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. 12 రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతూ వెంటిలేటర్ పైనే ఉన్న ఫార్మాసిస్ట్.. ఈరోజు (శుక్రవారం) ప్రాణాలు విడిచింది. నాగాంజలి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపుల వల్ల పార్మాసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడు దీపక్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ అన్ని రాజకీయ పార్టీల నేతలను బాధితురాలి తల్లిదండ్రులు అనంతలక్ష్మి, దుర్గారావులు మొర్రపెట్టుకున్నారు.
![]() |
![]() |