రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హచ్చరించారు. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున ఈ రోజు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. గంటకు 40-50కి.మీ. వేగంతో గాలులు వీయొచ్చని, కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. తర్వాత ఎండ తీవ్రత పెరిగే అవకాశముందన్నారు.
![]() |
![]() |