ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఆస్పత్రుల సంఘం ప్రకటించింది.: జిల్లాలో నెట్‌వర్క్ ఆస్పత్రులు ఎన్టీఆర్ వైద్య సేవను నిలిపివేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో సోమవారం నుంచి అన్ని రకాల ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్(ఆషా) ప్రకటించింది. విశాఖపట్నంలో దాదాపు 102 నెట్‌వర్క్ ఆస్పత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సందర్భంగా ఆషా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం. మురళీకృష్ణ మాట్లాడుతూ బకాయిల కారణంగా ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ.3,500 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, దీని వల్ల ఆస్పత్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
![]() |
![]() |