చిలకలూరిపేటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు, కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్, అధికారులు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు అర్జీ దారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలను అధికారులు మాట్లాడి పరిష్కరిస్తున్నారు.అందులో భాగంగా తొలిసారిగా చిలకలూరిపేట నియోజకవర్గాన్ని ఎంపిక చేశామన్నారు. ఈ అవకాశాన్ని నియోజక ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధికారులతో కలిసి చిలకలూరిపేటలో ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని, అదే సమయంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సైతం ఫిర్యాదులు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు.
![]() |
![]() |