ఆరోగ్యానికి మంచిదైనా ఆహారం రుచిగా లేకుంటే అస్సలు తినం. అలాంటి పదార్థల్లో కాకరకాయ ఒక్కటి. చాలా మంది కాకర పదం వింటేనే అమ్మో కాకరకాయ కూర అని పెదవి విరుస్తారు. కాకరకాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, బీటా కెరోటీన్, ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి.కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే తరచూ కాకరకాయ తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అజీర్తి కూడా దరి చేరదు. కాకరకాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులి పురుగులు, ఇతర క్రిములను నాశనం చేస్తుంది.కాకరకాయ తరచుగా తినడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందట. కాకరకాయలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. కాకరకాయలు తింటే ఇన్ఫెక్షన్స్ వంటివి రావు. కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే ఫ్రీరాడికల్స్ వల్ల నష్టం రాదు, కణాలు ఆరోగ్యంగా మారుతాయి.కాకరకాయలో ఉండే మెగ్నీషియం, పొటాషియం గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తపోటుని కంట్రోల్ చేస్తాయి. కాకరకాయ తింటే గుండె సమస్యలు, స్ట్రోక్ వంటివి రావు. కాకరకాయలో ఉండే చేదు జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. కాకరకాయలు తినడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.
![]() |
![]() |