యల్లనూరు మండల ఇన్ఛార్జి తహశీల్దారుగా పుట్లూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న శేషారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు మంగళవారం జారీ చేశారు.
యల్లనూరులో విధులు నిర్వహిస్తున్న రాజా సెలవుపై వెళ్లడంతో శేషారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ తహశీల్దార్ విధులు నిర్వహిస్తున్న వారంతా సెలవుపై వెళ్తుండటంతో ఇన్ చార్జ్ పాలనే దిక్కయిందంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa